భూకంపం వస్తే ఎలా ఉంటుందో చూశారా?.. వీడియో ఇదిగో!
- చేత్తో పట్టుకుని ఊపినట్టుగా ఊగిపోయిన భూమి
- కారు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డయిన దృశ్యం
- 50 వేలకు చేరిన టర్కీ, సిరియా భూకంప మృతుల సంఖ్య
కాగా, సోమవారం రాత్రి సంభవించిన భూకంపం ఓ కారు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. భూమిని ఎవరో చేత్తో పట్టుకుని ఊపినట్టుగా ఒక్కసారిగా ఊగిపోయింది. కొన్ని క్షణాల పాటు భూమి అలా కంపించింది. కాగా, రెండువారాల క్రితం టర్కీ, సిరియాల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 50 వేల మంది మరణించారు. టర్కీ, సిరియాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.