Drunk Driving: వైజాగ్ లో మందుబాబులకు చిత్రమైన శిక్ష... వీడియో ఇదిగో!

  • డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు
  • కోర్టులో 52 మంది మందుబాబుల హాజరు
  • ఒక రోజంతా ఆర్కే బీచ్ లో చెత్త ఏరివేయాలన్న న్యాయమూర్తి
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
Judge orders drunk drivers go and clean RK Beach in Vizag all the day

వైజాగ్ నగరంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. పోలీసులు 52 మంది మందుబాబులను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి వారికి ఆసక్తికరమైన శిక్ష విధించారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో చెత్తను ఏరివేయడమే మీకు విధిస్తున్న శిక్ష అని పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్ లోని చెత్తను ఏరివేస్తుండాలని స్పష్టం చేశారు. 

దాంతో, పోలీసులు ఆ మందుబాబులను తీసుకుని బీచ్ కు వచ్చి, వారితో చెత్త ఏరివేత కార్యక్రమం షురూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News