Seva Tickets: రేపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

TTD will release seva tickets tomorrow
  • సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో విడుదల
  • మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఆర్జిత సేవల టికెట్ల విడుదల
  • రేపటి నుంచి ఈ నెల 24 వరకు లక్కీ డిప్
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన టికెట్లను రేపు సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. కాగా, రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్ లక్కీ డిప్ నిర్వహించనున్నారు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు... నిర్దేశిత రుసుం చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని టీటీడీ సూచించింది. కాగా, టీటీడీ ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి.
Seva Tickets
Tirumala
TTD

More Telugu News