హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అమెరికా ఫ్లయిట్ ఎక్కిన రామ్ చరణ్

  • నల్లటి కుర్తా, పైజామాతో కనిపించిన రామ్ చరణ్
  • ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్
  • మార్చి 13న జరగనున్న కార్యక్రమం
హీరో రామ్ చరణ్ తేజ్ మంగళవారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. నల్లటి సంప్రదాయ వస్త్రధారణతో చరణ్ కనిపించాడు. కుర్తా పైజామా ధరించాడు. దీనికి తోడు బ్లాక్ మాస్క్ పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మధ్యమాల్లోకి చేరాయి. 

ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాల దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. ‘‘గోల్డెన్ గ్లోబ్ 2023 సందర్భంగా అమెరికాలో ఉన్న భారీ అభిమానుల నుంచి ఊహించనంత ప్రేమను అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. నేడు ఆస్కార్ వేడుకల కోసం వెళుతూ కనిపించాడు’’ అంటూ ట్వీట్ చేశారు. నిజానికి ఆస్కార్ అవార్డుల కార్యక్రమం మార్చి 13న జరగనుంది. అవార్డుల కార్యక్రమం నేపథ్యంలోనే రామ్ చరణ్ అమెరికా వెళ్లాడా? లేక ఇతరత్రా కార్యక్రమాల కోసం వెళ్లాడా? అన్నది తెలియదు. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్ పొందడం తెలిసిందే.

Ram Charan
ethnic look
Hyderabad airport

More Telugu News