Atchannaidu: ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది: అచ్చెన్నాయుడు

Atchannaidu alleged TDP office vandalized under MLA Vamsi guidence
  • గన్నవరం టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
  • పోలీసులు ఏంచేస్తున్నారంటూ అచ్చెన్న ఆగ్రహం
  • రౌడీ పాలనకు పరాకాష్ఠ అంటూ విమర్శలు
  • టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేసి విధ్వంసం సృష్టించడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఆరోపించారు. 

వైసీపీ రౌడీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి రౌడీ పాలనకు పరాకాష్ఠ అని అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Atchannaidu
TDP Office
Gannavaram
Vallabhaneni Vamsi

More Telugu News