ఆంధ్రా యూనివర్సిటీ వీసీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
- వర్సిటీని రాజకీయాలకు వేదికగా మార్చుతున్నారని ఆరోపణ
- వీసీ రాజకీయ సమావేశాల్లో పాల్గొంటున్నారని కంప్లయింట్
- ఎన్నికల ప్రధాన అధికారికి వినతిపత్రం సమర్పణ
వీసీ ప్రసాదరెడ్డి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కు మద్దతుగా సమావేశం ఏర్పాటు చేసినట్టు కథనాలు వచ్చాయి. ఈ సమావేశానికి రావాలంటూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలకు నాలుగు రోజుల కిందటే ఆహ్వానాలు వెళ్లినట్టు తెలుస్తోంది.
వీసీ ప్రసాదరెడ్డిపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వర్సిటీలో కేకులు కట్ చేయడం, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారని విపక్షాలు మండిపడ్డాయి.