అంబానీ, అదానీలకన్నా నా టైమే విలువైంది: బాబా రాందేవ్
- వ్యాపారవేత్తలు సమయాన్ని తమ కోసమే వెచ్చిస్తారని చెప్పిన బాబా రాందేవ్
- సాధుసన్యాసులు సమాజ శ్రేయస్సు కోసమే కాలం గడుపుతారని వెల్లడి
- గోవాలో పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న యోగా గురు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరిద్వార్ నుంచి తాను మూడు రోజుల పర్యటన కోసం గోవాకు వచ్చినట్లు తెలిపారు. కాలం విలువైందని, మిగతా వారితో పోలిస్తే ఓ సాధువు, సన్యాసి కాలానికే విలువ ఎక్కువని చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో పతంజలి కంపెనీ సీఈవో, తన సహచరుడు ఆచార్య బాలకృష్ణను సన్మానించారు. మూతపడే స్థితిలోని పతంజలి కంపెనీని రూ.40 వేల కోట్ల టర్నోవర్ సాధించేలా డెవలప్ చేశారని ఆచార్య బాలకృష్ణపై బాబా రాందేవ్ ప్రశంసలు గుప్పించారు.