తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి
- తారకరత్న మృతిపై ఎంపీ విజయసాయి రెడ్డి సంతాపం
- ఆయన అకాల మరణం అత్యంత బాధాకరమని వ్యాఖ్య
- రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు
తారకరత్న పార్థివదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఆయన మృతిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని రేపు ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. రేపు సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.