మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి
- దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్
- నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య లీగ్ మ్యాచ్
- మొదట 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 రన్స్ చేసిన ఇంగ్లండ్
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులే చేసిన భారత్
వికెట్ కీపర్ రిచా ఘోష్ పోరాడినా భారత్ ను గెలిపించలేకపోయింది. రిచా ఘోష్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఓపెనర్ స్మృతి మంధన 52 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో సారా గ్లెన్ 2, లారెన్ బెల్ 1, సోఫీ ఎకెల్ స్టోన్ 1 వికెట్ తీశారు.
గ్రూప్ బి లో టీమిండియాకు ఇదే తొలి ఓటమి. ఇంతకుముందు జరిగిన లీగ్ మ్యాచ్ ల్లో టీమిండియా అమ్మాయిలు... పాకిస్థాన్, వెస్టిండీస్ పై నెగ్గారు. భారత్ తన తదుపరి లీగ్ మ్యాచ్ ను ఈ నెల 20న ఐర్లాండ్ తో ఆడనుంది. ఐర్లాండ్ పై నెగ్గితే భారత్ కు సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైనట్టే.