తారకరత్న మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన చంద్రబాబు
- మృత్యువుతో పోరాడి ఓడిన తారకరత్న
- ఎంతో బాధగా ఉందన్న చంద్రబాబు
- ప్రార్థనలు, ప్రయత్నాలు ఫలించలేదని తీవ్ర విచారం
- ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థిస్తున్నట్టు వెల్లడి
"23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న, చివరికి మాకు దూరమై మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.