Annapurna: అన్నపూర్ణ, కెప్టెన్ కుక్ బ్రాండ్లను అమ్మేస్తున్న హిందుస్థాన్ యూనిలీవర్

  • అట్టా, ఉప్పు అమ్మకాల్లో పేరుమోసిన బ్రాండ్లు అన్నపూర్ణ, కెప్టెన్ కుక్
  • రూ. 60.4 కోట్లకు అమ్మేస్తున్న హిందుస్థాన్ యూనిలీవర్
  • నాన్ కోర్ కేటగిరీల నుంచి తప్పుకోవడానికే అని ప్రకటన
Hindustan Unilever selling Annapurna and Captain Cook brands

గోధుమపిండి, ఉప్పు అంటేనే అన్నపూర్ణ, కెప్టెన్ కుక్ బ్రాండ్లు గుర్తుకొస్తాయి. ఈ రెండు బ్రాండ్లను హిందుస్థాన్ యూనిలీవర్ అమ్మేస్తోంది. సింగపూర్ కు చెందిన ఉమా గ్లోబల్ ఫుడ్స్, ఉమా కన్జ్యూమర్ ప్రాడక్ట్స్ కు ఈ బ్రాండ్స్ ను విక్రయిస్తోంది. రూ. 60.4 కోట్లకు ఈ బ్రాండ్లను అమ్మేస్తోంది. డీల్ లో భాగంగా ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్, మేథో సంపత్తి హక్కులతో పాటు అన్నపూర్ణ, కెప్టెన్ కుక్ లకు ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టులు అన్నీ బదిలీ అవుతాయని హిందుస్థాన్ యూనిలీవర్ తెలిపింది. 90 రోజుల కాల వ్యవధిలో డీల్ పూర్తవుతుందని పేర్కొంది.  

2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్నపూర్ణ, కెప్టెన్ కుక్ బ్రాండ్ల టర్నోవర్ రూ. 127 కోట్లుగా ఉంది. మొత్తం హిందుస్థాన్ యూనిలీవర్ టర్నోవర్ లో ఇది ఒక శాతానికి సమానం. నాన్ కోర్ కేటగిరీల నుంచి తప్పుకోవడానికే వీటిని అమ్మేస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ రెండు బ్రాండ్లను హిందుస్థాన్ యూనిలీవర్ ప్రారంభించింది.

More Telugu News