WhatsApp: వాట్సప్ లో కొత్త ఫీచర్.. హై క్వాలిటీ ఫొటోలు ఇలా పంపొచ్చు..!

WhatsApp rolls out photo quality feature

  • హై క్వాలిటీ ఫొటోలు పంపలేకపోతున్న యూజర్లు
  • సెట్టింగ్స్ ను మార్చిన వాట్సప్
  • ఆండ్రాయిడ్, ఐఫోన్ ఫోన్లలో అందుబాటులోకి

వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లని తీసుకొస్తుంటుంది. తాజాగా యూజర్లు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపుతూ మరొక కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. వాట్సప్ లో హై క్వాలిటీ ఫొటోలు పంపించడంలో ఇప్పటిదాకా సమస్య ఉంది. తాజా ఫీచర్ ద్వారా నేరుగా హై క్వాలిటీ ఫొటోలు పంపుకొనే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం సెట్టింగ్స్ లో స్లోరేజ్ అండ్ డేటా ఆప్షన్ లోకి వెళ్లాలి. అందులో ఆప్షన్స్ టాప్ లో మీడియా అప్ లోడ్ క్వాలిటీని ఎంచుకోవాలి. అందులో ఆటో, బెస్ట్ క్వాలిటీ, డేటా సేవర్ అనే మూడు ఆప్షన్లు ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీ ఆప్షన్ ను టిక్ చేస్తే హై క్వాలిటీ ఫొటోలను పంపించవచ్చు. ఈ సౌకర్యం ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది.

More Telugu News