Gouthami: చిరూ .. బాలయ్యలతో అందుకే చేయలేకపోయాను: నటి గౌతమి

Gouthami Interview
  • 80వ దశకంలో గ్లామరస్ హీరోయిన్ గా గౌతమి 
  • తన పేరెంట్స్ తనని ప్రోత్సహించారని వెల్లడి 
  • తన కూతురు ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్లిందని వివరణ 
  • సీనియర్ హీరోయిన్స్ పట్ల గౌరవం ఉందన్న గౌతమి
1980లలోను హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ నడిచింది. 80వ దశకం చివరలో తెలుగు సినిమాకి పరిచయమైన గౌతమి, గ్లామరస్ కథానాయికగా మంచి మార్కులను కొట్టేశారు. అంత పోటీలోనూ తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. వెంకటేశ్ .. నాగార్జున వంటి స్టార్స్ జోడీగా తెరపై సందడి చేశారు. 

తాజా ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ .. "చిరంజీవిగారు .. బాలకృష్ణగారి సినిమాల నుంచి కూడా నాకు అవకాశాలు వచ్చాయి. అయితే నా డేట్స్ కుదరకపోవడం వలన, ఆ ఇద్దరితో చేయలేకపోయాను. సినిమాల దిశగా మా పేరెంట్స్ నన్ను ప్రోత్సహించారు. కానీ నేను చెప్పకుండానే మా అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్లింది" అని అన్నారు. 

"80వ దశకానికి సంబంధించిన హీరోయిన్స్ టీమ్ ప్రతి ఏడాది కలుస్తుంటారు. నన్ను కూడా ఆహ్వానిస్తూనే ఉంటారు. అయితే నిజానికి వాళ్లంతా నా సీనియర్స్. అందువలన వాళ్లంటే నాకు ఎంతో గౌరవం ఉంది. అలాంటివారితో నేను చనువుగా మసలుకోలేను. అందువల్లనే నేను వెళ్లడం లేదు" అంటూ చెప్పుకొచ్చారు. 

Gouthami
Actress
Tollywood

More Telugu News