Fashion: ఫ్యాషన్ పేరిట బిగుతు దుస్తులు ధరిస్తే జరిగేది ఇదే!

  • బిగుతు దుస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
  • టైట్ దుస్తులతో చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం
  • రక్తప్రసరణ సాఫీగా జరగక కీలకమైన నాడులు దెబ్బతినే ముప్పు  
  • ఆహారం అరుగుదలలో సమస్యలు వచ్చే అవకాశం 
Tight clothes causes skin problems

ఆధునిక జమానాలో యువత ఫ్యాషనబుల్‌గా కనిపించేందుకు తాపత్రయ పడుతోంది. దుస్తులు బిగుతుగా, ఇబ్బందికరంగా ఉన్నా పట్టించుకోవట్లేదు. తమ శరీరాకృతికి సరిపడనివి వేసుకుంటూ కొందరు ఇబ్బందిని భరిస్తుంటారు. ట్రెండీగా కనిపించాలంటే ఆ మాత్రం తిప్పలు తప్పవని సర్దిచెప్పుకుంటారు. అయితే..ఇలాంటి ఆలోచనా ధోరణి ఏమాత్రం సరికాదని వైద్యులు చెబుతున్నారు. రోజులో అధికభాగం బిగుతైన దుస్తులు ధరిస్తే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

బిగుతైన దుస్తులతో వచ్చే సమస్యలు.. 

  • బిగుతైన దుస్తులతో చర్మంలో రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడొచ్చు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో కీలకమైన నాడులు దెబ్బతింటాయి. 
  • చర్మంపైనే చమట నిలిచిపోయి స్వేదరంధ్రాల్లో మురికి పేరుకుపోతుంది. ఫలితంగా..  రకరకాల దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది.
  • ఇక పొట్ట చుట్టూ బిగుతుగా ఉంటే ఆహారం అరుగుదలలో సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
  • సున్నితమైన చర్మం కలవారు బిగుతైన దుస్తులకు దూరంగా ఉంటేనే మంచిది.
  • నైలాన్, రెసిన్ వంటి సింథటిక్ వస్త్రాలకు బదులు, కాటన్‌తో తయారైన సహజసిద్ధమైన దుస్తులను ఎంపిక చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

More Telugu News