Ramcharan: రామ్ చరణ్ సినిమా సెట్స్ లో గంటా శ్రీనివాసరావు

  • రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో కొత్త సినిమా
  • ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతున్న షూటింగ్
  • చరణ్, శంకర్ లను అభినందించిన గంటా
Ganta Srinivasa Rao in Ramcharan movie sets

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, తమిళ దర్శక దిగ్గజం శంకర్ కాంబినేషన్లో భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం విశాఖలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

 ఈ క్రమంలో షూటింగ్ సెట్ కు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెళ్లారు. చరణ్, శంకర్ లను ఆయన అభినందించారు. ఈ విషయాన్ని గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చరణ్, శంకర్ లతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. మరోవైపు ఈ చిత్రంలో శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జే. సూర్య, అంజలి కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమ బ్యానర్ లో ఇది 50వ సినిమా కావడంతో దిల్ రాజు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 

More Telugu News