Errabelli: అందుకే ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది: ఎర్రబెల్లి దయాకర్ రావు

  • బడ్జెట్ లో విద్య, వైద్యానికి భారీగా కేటాయింపులు చేశామన్న ఎర్రబెల్లి
  • హైదరాబాద్ నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని వ్యాఖ్య
  • ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్న ఎర్రబెల్లి
People faith on govt hospitals increasing says Errabelli

రాష్ట్ర బడ్జెట్ లో వైద్య, ఆరోగ్య శాఖకు భారీగా కేటాయింపులు చేశారని తెలంగాణ పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విద్య, వైద్య రంగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వరంగల్ లో రూ. 11 వందల కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు. 

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని... అందుకే ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని అన్నారు. ప్రైవేట్ వైద్యులు కూడా కేవలం వ్యాపార ధోరణితో మాత్రమే ఆలోచించకుండా సేవా ధృక్పథంతో సేవ చేయాలని చెప్పారు. వరంగల్ జిల్లా ఆరేపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News