Manchu Lakshmi: యాక్షన్ లోకి దిగిపోయిన మంచు లక్ష్మి .. 'అగ్ని నక్షత్రం' ఫస్టు గ్లింప్స్

  • మంచు లక్ష్మి ప్రధాన పాత్రగా 'అగ్ని నక్షత్రం'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ ఇది
  • కీలకమైన పాత్రలో సముద్రఖని 
  • ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్న మోహన్ బాబు
Agni Nakshtram Movie Frist Glimps

మంచు లక్ష్మి ఆ మధ్య కాలంలో తాను కేంద్ర బిందువుగా సాగే సినిమాలను చేస్తూ వెళ్లింది. కొంతకాలంగా ఆమె సినిమాల సంఖ్యను తగ్గించింది. అలాంటి మంచు లక్ష్మి తన తండ్రి బ్యానర్ తో కలిసి నాయిక ప్రధానమైన పాత్రలో ఒక సినిమా చేస్తోంది .. ఆ సినిమానే 'అగ్ని నక్షత్రం'. 

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మంచు లక్ష్మి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ .. హైదరాబాద్ నేపథ్యంలో ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది. యాక్షన్ .. సస్పెన్స్ తాలూకు సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆసక్తిని రేపుతోంది. 

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ముందుకు వెళ్లిన ఆమె, అనూహ్యమైన పరిణామాలను ఎదుర్కుంటుందనే విషయం ఈ ఫస్టు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ప్రతినాయకుడిగా సముద్రఖని నటించిన ఈ సినిమాలో, మోహన్ బాబు ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు.

More Telugu News