Anushka Shetty: నవ్వితే షూటింగ్ ఆగాల్సిందే... విచిత్రమైన సమస్యతో ఇబ్బంది పడుతున్న అనుష్క

  • నవ్వు ఆపుకోలేని సమస్యతో ఇబ్బంది పడుతున్న అనుష్క
  • నవ్వితే.. 15 నిమిషాల పాటు అలాగే నవ్వుతున్న స్వీటీ
  • అటూ, ఇటూ తిరుగుతూ నవ్వుతుంటానన్న అనుష్క
Anushka Shetty facing issues with laugh

తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్లలో కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి ఒకరు. ఎన్నో ఏళ్ల పాటు ఆమె టాలీవుడ్ లో అగ్రనటిగా వెలుగొందారు. ఆ తర్వాత బొద్దుగా తయారు కావడంతో పాటు, వయసు కూడా పెరగడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న 'మిస్టర్ పోలిశెట్టి' చిత్రంలో అనుష్క నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో స్వీటీ బిజీగా ఉన్నారు. 

మరోవైపు ఆమెకు సంబంధించిన ఒక విషయం వెలుగులోకి వచ్చింది. నవ్వు ఆపుకోలేని ఒక విచిత్రమైన సమస్యతో ఆమె ఇబ్బంది పడుతోందనేదే ఆ వార్త. ఒక్కసారి నవ్వితే... కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఆమె నవ్వుతూనే ఉంటుందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమే స్వయంగా వెల్లడించింది. తాను నవ్వడం ప్రారంభిస్తే... షూటింగ్ ను కాసేపు ఆపేస్తారని అనుష్క తెలిపారు. తాను అటూ, ఇటూ తిరుగుతూ నవ్వుతూ ఉంటానని చెప్పారు.

More Telugu News