ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడనే వార్తలపై శ్రీలంక ప్రభుత్వ స్పందన
- ప్రభాకరన్ బతికే ఉన్నాడని నిన్న ప్రకటించిన నెడుమారన్
- ఈ వార్తలను కొట్టిపారేసిన శ్రీలంక ప్రభుత్వం
- 2009 మే 19న ప్రభాకరన్ హతమయ్యారన్న శ్రీలంక రక్షణ శాఖ
ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. నెడుమారన్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ఇదేమైనా జోకా? అంటూ శ్రీలంక రక్షణ మంత్రి అన్నారు. శ్రీలంక రక్షణ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ... 2009 మే 19న ప్రభాకరన్ హతమైనట్టు ధ్రువీకరించారని తెలిపారు. ఆయన డీఎన్ఏను కూడా పరీక్షించారని చెప్పారు.