Ramcharan: రామ్ చరణ్ కొత్త ‘అవతార్’.. ఇదిగో!

Ram Charan  new Avatar for shankar movie
షార్ట్స్‌లో చూడండి
ఆర్ఆర్ఆర్ చిత్రం విజయంతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభం నుంచి ఆయన వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రతీసారి ఓ ప్రత్యేక కథ, సినిమా, క్యారెక్టర్ తో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో సీతా రామరాజు పాత్రలో మెప్పించిన ఆయన ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. చరణ్ కెరీర్ లో ఇది 15వ సినిమా. ‘ఆర్‌‌సి 15’ వర్కింగ్ టైటిల్‌తో వేగంగా తెరకెక్కుతోంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెండు పాత్రల కోసం రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఇప్పటికే ఓ పాత్ర లుక్ లో చరణ్ బయట కనిపించారు. ఇప్పుడు రెండో పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. 

ఇందుకోసం సెలబ్రిటీల హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హాకిమ్ ను ఆశ్రయించారు. హాకిమ్ తనదైన శైలిలో చరణ్‌కి కొత్త హెయిర్ స్టయిల్ చేసి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘మా సూపర్ డూపర్ స్టార్ మరొక కొత్త అవతార్‌‌లో కనిపించడానికి రెడీ’ అని ట్వీట్ చేశాడు. చెర్రీ స్టయిల్ గా, మోడర్న్ గా ఉన్న ఈ లుక్ వైరల్ అయ్యింది. కాగా, ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యే బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న కియారా త్వరలోనే తిరిగి షూటింగ్ కు హాజరవనుంది. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
Go Back to Shorts
Ramcharan
new movies
director shankar
kiara
Tollywood
Bollywood

More Telugu News