ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
- సభకు సమాధానం ఇచ్చిన సీఎం కేసీఆర్
- ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
- అనంతరం సభ నిరవధిక వాయిదా
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 7 రోజుల పాటు సాగాయి. మొత్తం 56 గంటల 25 నిమిషాల సేపు అసెంబ్లీ కార్యకలాపాలు కొనసాగాయి. టీఆర్ఎస్ పార్టీ ఇటీవలే బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందడం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే.