Upasana: రామ్‌చరణ్‌పై ఉపాసన ‘రివెంజ్’

Upasana shares funny video made by fans
  • నెట్టింట ఫన్నీ వీడియో వైరల్
  • రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసననూ ఆకట్టుకున్న వీడియో
రామ్‌చరణ్‌పై ఆయన సతీమణి ఉపాసన రివెంజ్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ నెటిజన్ నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఉపాసనకు కూడా నచ్చడంతో ఆమె దీన్ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ రెండు స్మైలీ ఎమోజీలను జత చేశారు. 

సుమారు నాలుగు నెలల క్రితం అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల సందర్భంగా.. రామ్‌చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్‌ల వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో రామ్‌చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్ ఒకే సోఫాలో కూర్చున్నారు. అయితే..సోఫా కాస్త ఇరుగ్గా ఉండటంతో రామ్‌చరణ్ ఉపాసనను పక్క సీటులో కూర్చోమని సరదాగా చెప్పారు. ఆమెను అలా ఆటపట్టించినందుకు రామ్‌చరణ్.. సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి పకపకా నవ్వడం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. 

అబ్బాయిల ఫన్ ఇలా ఉంటుందన్న ఓ నెటిజన్.. దీనికి అమ్మాయిల కౌంటర్ మరో లెవెల్‌లో ఉంటుందంటూ రామ్‌చరణ్, ఉపాసనల మరో వీడియోను జత చేశారు. ఇందులో ఉపాసన రామ్‌చరణ్‌తో ఇంటి పనులన్నీ చేయించినట్టు చూపించారు. చెట్లకు నీళ్లు పోయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, స్వయంగా కాఫీ కలిపి ఉపాసనకు ఇవ్వడం తదితర సీన్లన్నీ చూపించి.. అమ్మాయిలతో వ్యవహారం ఇలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ బాగా క్లిక్ అవడంతో నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.
                                                  వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Upasana
Ramcharan

More Telugu News