Tollywood: కొత్త బిజినెస్​ పెట్టా.. అందుకే నటించడం లేదు: సీనియర్​ నటి హేమ

Got a new business that is why am not acting says Senior actress Hema
  • క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో హేమకు మంచి గుర్తింపు
  • కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న హేమ
  • బిజినెస్ లో లాభాలతో సుఖపడటం అలవాటైపోయిందని వ్యాఖ్య
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటి హేమకు మంచి గుర్తింపు ఉంది. ఏ పాత్రలో అయినా సరే ఆమె ఒదిగిపోయి నటిస్తుంది. హాస్యం కూడా పండించ గలగటం ఆమె ప్రత్యేకత. అయితే, ఈ మధ్య ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. దీనికి కారణం ఆమెనే వెల్లడించింది. 

తాను ఈ మధ్యే కొత్త బిజినెస్ ప్రారంభించానని చెప్పింది. అందులో మంచి లాభాలు వస్తున్నాయని తెలిపింది. సంపాదన ఎక్కువ అవడంతో సుఖ పడటం అలవాటైపోయిందని ఆమె వ్యాఖ్యానించింది. కష్టపడటానికి ఇష్టపడటం లేదని చెప్పింది. అందుకే నటనకు దూరంగా ఉంటుంన్నట్టు తెలిపింది. అయితే, తన బిజినెస్ ఏమిటన్న వివరాలను మాత్రం హేమ వెల్లడించలేదు.
Tollywood
Senior actress Hema
business

More Telugu News