Rashmika Mandanna: అది నిజమైతే బాగుండు.. నెట్టింట్లో కథనంపై రష్మిక కౌంటర్

News of Rashmika mandanna buying five houses after pushpa success goes viral
  • రష్మిక ఐదు ఇళ్లు కొందంటూ నెట్టింట కథనం వైరల్ 
  • ‘పుష్ఫ’ ఎఫెక్ట్ అంటూ కామెంట్స్
  • ఫన్నీగా కౌంటర్ ఇచ్చిన నటి
పుష్ప మూవీ సక్సెస్ ఇచ్చిన కిక్‌తో నటి రష్మిక మందన్న దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏకంగా ఐదు ఇళ్లు కొనేశారన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది రష్మిక దృష్టికి రావడంతో ఆమె కూడా అందుకు తగ్గట్టుగానే సమాధానం ఇచ్చారు. రష్మిక కౌంటర్ ప్రస్తుతం నెటిజన్లను యమాగా ఆకట్టుకుంటోంది. 

‘పుష్ప’ తరువాత రష్మిక మందన్న రేంజ్ అమాంతం పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె వరుసగా కొత్త ప్రాజెక్టులు ఓకే చేశారు. ఇదే ఊపులో రష్మిక దేశంలోని వివిధ ప్రాంతాల్లో 5 విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేశారన్న వార్త అకస్మాత్తుగా వైరల్ అయ్యింది. కూర్గ్, ముంబై, హైదరాబాద్, గోవా, బెంగళూరు నగరాల్లో ఈ ఇళ్లు ఉన్నాయట. 

ఈ ట్వీట్‌పై రష్మిక దృష్టి పడటంతో ఆమె తనదైన శైలిలో స్పందించారు. ‘అవన్నీ నిజమైతే బాగుండు’.. అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. రష్మిక రిప్లై నెటిజన్లకు నచ్చడంతో ఈ ఉదంతం ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. 

‘వారిసు’, ‘మిషన్ మజ్నూ’ సినిమాల తరువాత రష్మిక ప్రస్తుతం ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. రణబీర్ కపూర్ ఇందులో హీరో. ఈ మూవీతో పాటూ రష్మిక ‘పుష్ప-2’లోనూ చేస్తున్నారు.
Rashmika Mandanna

More Telugu News