K Kavitha: సినీ నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఫొటోలు ఇవిగో

Kavitha visits actor Arjun constructed Hanuman temple in Chennai
  • కవితకు ఘన స్వాగతం పలికిన అర్జున్ దంపతులు
  • ఆలయం నిర్మించినందుకు అర్జున్ కు అభినందనలు తెలిపిన కవిత
  • చెన్నైకు రావడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని వ్యాఖ్య
ప్రముఖ సినీ నటుడు అర్జున్ చెన్నైలో ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఆలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అంతకు ముందు కవితకు అర్జున్ దంపతులు ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్ కు అభినందనలు తెలిపారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని చెప్పారు. తమిళనాడు ప్రజలు వారి సంస్కృతి, చరిత్ర, భాష, వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని అన్నారు. ఇక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని కొనియాడారు. మరోవైపు, ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి కవిత చెన్నై వెళ్లారు. 
K Kavitha
BRS
Arjun
Hanuman Temple
Chennai

More Telugu News