Ram Charan: కేటీఆర్ గారు నగరానికి అద్భుతమైన కార్యక్రమాలు తీసుకువస్తున్నారు: రామ్ చరణ్

Ram Charan thanked KTR for bringing Formula E like initiatives to Hyderabad
  • హైదరాబాదులో నేటి నుంచి ఫార్ములా-ఇ గ్రాండ్ ప్రీ
  • మహీంద్రా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్
  • నిన్న ఆనంద్ మహీంద్రా, కేటీఆర్ లను కలిసిన వైనం
హైదరాబాదులో ఫార్ములా-ఇ గ్రాండ్ ప్రీ రేసుకు నేడు తెరలేవనుంది. ఈ పోటీల్లో మహీంద్రా సంస్థకు చెందిన జట్టు కూడా పాల్గొంటోంది. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ మహీంద్రా రేసింగ్ టీమ్ ను కలిశారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా వ్యాపార సామ్రాజ్య అధినేత ఆనంద్ మహీంద్రా, తెలంగాణ మంత్రి కేటీఆర్, టెక్ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నానీలతో రామ్ చరణ్ ముచ్చటించారు.

దీనిపై చరణ్ నేడు ట్వీట్ చేశారు. మహీంద్రా రేసింగ్ జట్టు శిబిరంలో ఆనంద్ మహీంద్రా, సీపీ గుర్నానీలతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని వెల్లడించారు. ఫార్ములా-ఇ రేసింగ్ లో వారు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఇక, హైదరాబాద్ నగరానికి ఇంతటి అమోఘమైన కార్యక్రమాలు తీసుకువస్తున్న కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.
Ram Charan
KTR
Formula-E
Anand Mahindra
Mahindra Racing
Hyderabad
Telangana

More Telugu News