మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్ చిత్రం
- ఇప్పటికే రూ. 729 కోట్ల గ్రాస్ కలెక్షన్
- ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ గ్రాస్ సాధించిన హిందీ చిత్రంగా రికార్డు
- భారత్ లోనే రూ. 453 కోట్ల వసూళ్లు
దంగల్ ప్రపంచ వ్యాపంగా రూ. 2 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ, ఇందులో చైనా (చైనీస్)తో పాటు మాండరిన్ భాషలోనే అత్యధిక మొత్తం లభించింది. ఈ నేపథ్యంలో చాలా తక్కువ వ్యవధిలోనే రూ. 700 కోట్ల మార్కును దాటిన ‘పఠాన్’ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి భారత్ బాక్సాపీస్ దగ్గరే రూ. 453 కోట్లు లభించాయి. ఇతర దేశాల్లో రూ. 276 కోట్ల వసూళ్లు వచ్చాయి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం విలన్ పాత్ర పోషించాడు. ఆదిత్య చోప్రా నిర్మించారు.