శంషాబాద్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు
- 10.30 గంటలకు ఉత్సవారంభ స్నపనంతో వేడుకల ప్రారంభం
- 14వ తేదీ వరకు కొనసాగనున్న ఉత్సవాలు
- భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విష్వక్సేన వీధి శోధన నిర్వహిస్తారు. 1.30 గంటలకు తీర్థ ప్రసాద గోష్ఠి, సాయంత్రం 5 నుంచి 45 నిమిషాలపాటు సామూహిక విష్ణు సహస్రనామ స్త్రోత్ర పారాయణం, సాయంత్రం ఆరు గంటల నుంచి 8.30 గంటల వరకు అంకురార్పణ వైనతేయ ప్రతిష్ఠ, తీర్థ ప్రసాద గోష్ఠి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.