Ram: రామ్ సినిమాలో ఆ యాక్షన్ సీన్ హైలైట్ అట!

Boyapati and Ram Movie Update
  • రామ్ హీరోగా బోయపాటి మూవీ 
  • యాక్షన్ ప్రధానంగా నడిచే కథ
  • యాక్షన్ హీరోగానే కనిపించనున్న రామ్ 
  • ఆయన జోడీ కట్టనున్న శ్రీలీల  
టాలీవుడ్ లో రామ్ కి లవర్ బాయ్ గా మంచి క్రేజ్ ఉంది. అయితే అందుకు భిన్నంగా మాస్ యాక్షన్ హీరోగా కూడా శభాష్ అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఈ కారణంగానే పూరితో 'ఇస్మార్ట్ శంకర్' చేశాడు. పూరి మేజిక్ వలన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత కూడా రామ్ తన సినిమాల్లో మాస్ కంటెంట్ ఉండేలా చూసుకున్నాడు. 

అయితే యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉండేలా ఆయన సెట్ చేసుకున్న కథలు ఆశించినస్థాయి ఫలితాలను ఇవ్వలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా ఆయన ఈ సారి కూడా యాక్షన్ కథనే ఎంచుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 

ఇటీవల ఈ సినిమాకి సంబంధించి 300 మంది ఫైటర్స్ తో రామ్ తలపడే సీన్ ను చిత్రీకరించారట. సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఇది నిలుస్తుందని చెబుతున్నారు. ఇంతమందితో రామ్ ఫైట్ వర్కౌట్ అవుతుందా? అతిగా అనిపిస్తుందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 'వినయ విధేయ రామా' సినిమాలోని ఫైట్స్ బోయపాటికి విమర్శలు తెచ్చిపెట్టిన సంగతిని గుర్తుచేసుకుంటున్నారు.
Ram
Boyapati Sreenu

More Telugu News