సానియా మీర్జా గురించి ఆమె భర్త షోయబ్ మాలిక్ భావోద్వేగ ట్వీట్
- తన కెరీర్ ను ముగించిన సానియా మీర్జా
- ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో రన్నరప్ తో సరిపెట్టుకున్న సానియా జోడీ
- నీవు సాధించిన వాటికి ఎంతో గర్విస్తున్నానన్న షోయబ్ మాలిక్
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సానియా ఆటతీరును చూసి చాలా గర్వపడుతున్నానని చెప్పారు. క్రీడా ప్రపంచంలో మహిళలకు నీవొక ఆశాకిరణం, స్ఫూర్తిదాయకమని కితాబునిచ్చారు. నీ కెరీర్ లో నీవు సాధించిన వాటికి ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. నమ్మశక్యంకాని కెరీర్ కు అభినందనలు అని భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. బ్రెజిల్ కు చెందిన లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్ లతో జరిగిన ఫైనల్స్ లో సానియా జోడీ ఓటమిపాలైన విషయం తెలిసిందే.