YS Avinash Reddy: సీబీఐ విచారణకు ముందు లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మను కలిసిన వైఎస్ అవినాశ్ రెడ్డి

YS Avinash Reddy meets YS Vijayamma before going to CBI office
  • మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ ముందు హాజరుకానున్న అవినాశ్ రెడ్డి
  • విజయమ్మను కలిసి వెళ్లిపోయిన అవినాశ్
  • సీబీఐ విచారణకు హాజరవుతున్నానని మీడియాతో చెప్పిన కడప ఎంపీ
దివంగత మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరుకానున్నారు. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు. మరోవైపు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మను వైఎస్ అవినాశ్ కలిశారు. లోటస్ పాండ్ కు వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. 

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... సీబీఐ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈ మధ్యాహ్నం కోఠిలోని కార్యాలయంలో విచారణకు హాజరవుతానని చెప్పారు. అనంతరం లోటస్ పాండ్ నుంచి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణను ఏపీ నుంచి హైదరాబాద్ కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.  
YS Avinash Reddy
YSRCP
YS Vijayamma
CBI
YS Vivekananda Reddy

More Telugu News