ఎయిర్ షో సందర్భంగా యలహంక ప్రాంతంలో మాంసాహార విక్రయాలపై నిషేధం
- ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఎయిర్ షో
- మాంసాహార వ్యర్థాలకు పక్షులు ఆకర్షితులవుతాయన్న బీబీఎంపీ
- వీటి వల్ల విమాన ప్రమాదాలు జరగకుండా నిర్ణయం
‘‘యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేడియం చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో మటన్, చికెన్ విక్రయాలు చేయకూడదు. అన్ని రెస్టారెంట్లు మీట్, చికెన్, చేపలతో చేసిన ఆహారాన్ని విక్రయించకూడదు’’ అని బీబీఎంపీ పేర్కొంది. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించింది. మాంసాహార వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తే అవి పక్షులు ముఖ్యంగా కైట్ తరహా పక్షులు వాటి కోసం వస్తాయని, వీటి కారణంగా విమాన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీబీఎంపీ తెలిపింది.