Devansh: అమెరికాలో కాల్పులు... విజయవాడ విద్యార్థి మృతి

  • షికాగోలో కాల్పుల మోత
  • విజయవాడకు చెందిన దేవాన్ష్ కన్నుమూత
  • మరో విద్యార్థి సాయిచరణ్ కు గాయాలు
Telugu student died in Chicago shooting

కాల్పుల సంస్కృతికి మారుపేరైన అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి కన్నుమూశాడు. షికాగోలో జరిగిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి దేవాన్ష్ మృతి చెందాడు. దేవాన్ష్ స్వస్థలం ఏపీలోని విజయవాడ. ఈ ఘటనలో సాయిచరణ్ అనే మరో విద్యార్థి గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. 

దేవాన్ష్, సాయిచరణ్, మరో విద్యార్థి వాల్ మార్ట్ స్టోర్ కు వెళుతుండగా, ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాగా, దేవాన్ష్ ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి కేవలం పది రోజులే అయినట్టు తెలుస్తోంది.

More Telugu News