chiranjeevi: వాల్తేరు వీరయ్యకు 2.25 రేటింగ్.. కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్

chiranjeevi counter to web sites
షార్ట్స్‌లో చూడండి
‘రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు.. రికార్డులే నా పేరు మీద ఉంటాయి..’ అన్న డైలాగ్ కు తగ్గట్లే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కలెక్షన్లతో దూసుకుపోతోంది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఓవర్సీస్ లో 2.2 మిలియన్ డాలర్లకు పైనే సాధించింది.

అయితే సినిమా రిలీజైన తర్వాత కొన్ని వెబ్ సైట్స్ 2.25 రేటింగ్స్ ఇచ్చాయి. దీనిపై హర్ట్ అయిన చిరంజీవి.. దాదాపు 10 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారు. ఇటీవల ఓవర్సీస్ ఫ్యాన్స్ తో మాట్లాడిన మెగాస్టార్... 2.25 రేటింగ్స్ కి కొత్త అర్థం చెప్పారు.

‘‘వాల్తేరు వీరయ్య సినిమాకి కొన్ని వెబ్ సైట్లు 2.25 రేటింగ్స్ ఇచ్చాయి. 2.25 అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు... ఇప్పుడు అర్థమైంది. 2.25 అంటే 2.25 మిలియన్ డాలర్లని ఇప్పుడు తెలిసింది. ఈ మూవీ ఓవర్సీస్ లో 2.25 మిలియన్ డాలర్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది’’ అని చెప్పుకొచ్చారు.

తక్కువ రేటింగ్ ఇచ్చిన వారికి చిరు కౌంటర్ మామూలుగా లేదని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వాల్తేర్ వీరయ్యకు వచ్చిన కలెక్షన్లతోనే జవాబు చెప్పారని అంటున్నారు.
Go Back to Shorts
chiranjeevi
valtheru veerayya
mega star
overseas
collection

More Telugu News