Twitter: వాడుకలో లేని డీజీపీ ఏపీ అఫిషియల్ అకౌంట్ హ్యాక్ చేశారన్న పోలీసులు

  • 2019లో ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసిన వైనం
  • 2020 ఫిబ్రవరి నుంచి అకౌంట్ నిలిపివేత.
  • అకౌంట్ ను హ్యాక్ చేసి అసభ్య ఫొటోలకు లైక్ కొడుతున్న వ్యక్తులు
  • సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదు
AP Police says dgpapofficial twitter account hacked

డీజీపీ పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. 2019లో డీజీపీ అఫిషియల్ (dgpapofficial) పేరుతో ట్విట్టర్ ఐడీ రూపొందించారు. అయితే ఈ అకౌంట్ ను 2020 ఫిబ్రవరిలో నిలిపివేశారు. అప్పటి నుంచి ఇది వాడుకలో లేదు. అయితే ఈ అకౌంట్ ను హ్యాక్ చేశారని ఏపీ పోలీసులు వెల్లడించారు. ఈ అకౌంట్ ద్వారా ట్విట్టర్ లోని అసభ్య ఫొటోలకు లైకులు కొడుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా చేస్తున్నట్టు భావిస్తున్నామని పేర్కొన్నారు. 

ఈ హ్యాకింగ్ పై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదైంది. హ్యాకింగ్ కు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు టెక్నికల్ విభాగం డీఐజీ పీహెచ్ డీ రామకృష్ణ వెల్లడించారు.

More Telugu News