India: హాకీ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన భారత్

  • న్యూజిలాండ్ తో కీలక మ్యాచ్
  • ఓటమిపాలైన భారత్
  • నిర్ణీత సమయానికి 3-3తో స్కోరు సమం
  • పెనాల్టీ షూటవుట్లో భారత్ 4-5తో ఓటమి
India lost to New Zealand in Hockey World Cup

సొంతగడ్డపై జరుగుతున్న హాకీ వరల్డ్ కప్ లో భారత్ క్వార్టర్ ఫైనల్స్ చేరడంలో విఫలమైంది. న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. నిర్ణీత సమయానికి స్కోరు 3-3తో సమం కాగా, పెనాల్టీ షూటవుట్ నిర్వహించారు. పెనాల్టీ షూటవుట్ లో భారత్ 4-5 తేడాతో పరాజయం చవిచూసింది. 

షూటవుట్లో షంషేర్ సింగ్, సుఖ్ జీత్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, అభిషేక్ గోల్స్ మిస్ చేయడం భారత్ కు ప్రతికూలంగా మారింది. ఇక భారత్ వర్గీకరణ మ్యాచ్ లో జపాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ జనవరి 26న జరగనుంది.

More Telugu News