'సలార్' దండయాత్ర... ఇంకో 250 రోజుల్లో...!
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్
- ట్వీట్ తో రిమైండ్ చేసిన మూవీ టీమ్
- సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు సినిమా
- ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి!
ఈ నేపథ్యంలో సలార్ టీమ్ #SalaarEuphoriaIn250Days అనే హ్యాష్ ట్యాగ్ ప్రత్యేక ట్వీట్ చేసింది. ఇంకేముంది ఈ ట్వీట్ కాస్తా వైరల్ అయింది. ఫ్యాన్స్ రీట్వీట్లు, కామెంట్లతో ట్రెండ్ అవుతోంది.
ఇప్పటికే దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ స్టిల్స్ అదిరిపోయాయి. కలెక్షన్లలో, రికార్డుల్లో కొత్త బెంచ్ మార్క్ ను సలార్ అందుకుంటుందో లేదో తెలియాలంటే మరో 8 నెలలు ఆగాల్సిందే.