ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్.. ప్రముఖ యూఎస్ మేగజైన్ అంచనా
- ఉత్తమ నటుడి కేటగిరీలో గట్టి పోటీదారుగా పేర్కొన్న మేగజైన్
- టాప్-10 జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ కు మొదటి స్థానం
- ఎన్టీఆర్ నటనను అకాడమీ తప్పకుండా గుర్తిస్తుందన్న అంచనా
ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ గా పోటీలో ఉండే టాప్-10 నటుల జాబితాను ఈ మేగజైన్ పేర్కొనగా.. అందులో జూనియర్ ఎన్టీఆర్ ను మొదటి స్థానంలో నిలిపింది. టామ్ క్రూజ్, పాల్ డనో, మియా గోత్, పాల్ మెస్కల్, జో క్రవిట్జ్ తదితరుల పేర్లు టాప్-10లో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించడం తెలిసిందే. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తీరును అస్కార్ అవార్డుల అకాడమీ తప్పకుండా గుర్తిస్తుందని, బెస్ట్ యాక్టర్ కేటగిరీ నామినేషన్లలో తప్పక చోటు లభిస్తుందని అంచనా వేసింది.