కరెంట్ తీగలు పట్టుకుంటే బండి సంజయ్ కి నిజం తెలుస్తుంది: మంత్రి పువ్వాడ
- వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ లేదనడం అబద్ధమన్న మంత్రి
- ఖమ్మంలో బీఆర్ఎస్ సభ సూపర్ హిట్ అయిందని వ్యాఖ్య
- కంటి వెలుగు పథకంలో కళ్ల జోడు పెట్టుకుంటేనే ప్రతిపక్షాలకు నిజాలు తెలుస్తాయని ఎద్దేవా
ఖమ్మం సభ విఫలం అయిందంటున్న వారికి తమ కంటి వెలుగు పథకంలో భాగంగా కళ్లద్దాలు ఇస్తామన్నారు. వాటిని పెట్టుకుని చూస్తేనైనా నిజాలు కనబడతాయని పువ్వాడ విమర్శించారు. విద్యుత్తు రంగాన్ని, పంపిణీ సంస్థలను గౌతమ్ అదానీకి కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి ఆరోపించారు. సంస్కరణల పేరుతో అన్నదాతలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని, ఈ కుట్రల నుంచి కాపాడుకునేందుకు విద్యుత్ ఉద్యోగులతో కలిసి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.