టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే కేసీఆర్ పతనం మొదలైంది: ఈటల
- కేసీఆర్ దళితులను వంచించి అధికారంలోకి వచ్చాడన్న ఈటల
- దళితుడ్ని సీఎం చేస్తానన్నాడని, మాట తప్పాడని విమర్శలు
- కేసీఆర్ చాంబర్ లో ఒక్క దళిత అధికారి కూడా లేడని వెల్లడి
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే కేసీఆర్ పతనం మొదలైందని అన్నారు. సామాన్యులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్, అధికారంలోకి వచ్చాక అణచివేస్తున్నారని ఈటల మండిపడ్డారు.
మాయమాటలు చెప్పి ఓట్లు పొందారని, ఇప్పుడదే మోడల్ ను దేశమంతా వర్తింపజేస్తావా? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం చూస్తుంటే, కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుందని ఎద్దేవా చేశారు.