మరో 2300 మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన అమెజాన్
- తమ కంపెనీలో 18 వేల మందిని తొలగిస్తామని అమెజాన్ ప్రకటన
- ఈ నెల తొలి వారంలో 8 వేల మంది తొలగింపు
- తాజా విడతలో మరికొందరికి లే ఆఫ్ నోటీసుల జారీ
అమెరికా, కెనడా, కోస్టారికా దేశాల్లో తమ ఉద్యోగులకు అమెజాన్ నోటీసులు ఇచ్చింది. వాటిని అందుకున్న ఉద్యోగులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ రెండో దశ తొలగింపులు మార్చిలో ప్రారంభమవుతాయి. ఉద్యోగం కోల్పోతున్న వారికి అమెజాన్ నిర్ణీత పరిహారం అందించనుంది. కాగా, ఇతర టెక్ కంపెనీల్లో తొలగింపులు కొనసాగుతున్నాయి. దాంతో, చాలా మంది ఉద్యోగుల పరిస్థితి భయంకరంగా మారింది. మైక్రోసాఫ్ట్ ఇటీవల 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గూగుల్, డుంజో, షేర్ చాట్ కూడా లే ఆఫ్ ను ప్రకటించాయి.