Fire Accident: సికింద్రాబాద్ లోని స్పోర్ట్స్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం

Massive fire Breaks out at deccan sports shop in secunderabad
  • మంటల్లో చిక్కుకున్న డెక్కన్ స్పోర్ట్స్ దుకాణం 
  • పక్కనే ఉన్న బట్టల దుకాణంలోకి వ్యాపించిన మంటలు
  • లోపల చిక్కుకున్న నలుగురిని భారీ క్రేన్ల సాయంతో రక్షించిన రెస్క్యూ టీం 
సికింద్రాబాద్ లోని ఓ షాప్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ షాప్ మంటల్లో చిక్కుకుంది. ఎగిసిపడుతున్న మంటలు పక్క షాపులకూ విస్తరించాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పక్క షాపులకు మంటలు పాకడంతో అందులో చిక్కుకుపోయిన నలుగురిని రక్షించారు. భారీ క్రేన్ సాయంతో వారిని కిందికి తీసుకొచ్చారు.

అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. బిల్డింగ్ లో నుంచి భారీగా పొగ వెలువడుతోంది. అగ్ని ప్రమాదం కారణంగా ప్రధాన రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆరు అంతస్తులు ఉన్న ఈ బిల్డింగ్ లో కింద కార్ల విడిభాగాల గోడౌన్, పైన స్పోర్ట్స్ షాపు నిర్వహిస్తున్నారు. అయితే, గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కార్ల విడిభాగాలు ఉన్న గోడౌన్ లో షార్ట్ సర్క్యూ ట్ కారణంగా మంటలు చెలరేగాయి. పై అంతస్తులో ఉన్న స్పోర్ట్స్ షాపుకు కూడా మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసింది.
Fire Accident
secunderabad
nallagutta
deccan sports shop
fire
short circute

More Telugu News