బహిరంగంగా స్కూటీపై రొమాన్స్.. జంట కోసం పోలీసుల వేట
- యూపీలోని హజరత్ గంజ్ లో చోటుచేసుకున్న ఘటన
- ప్రియుడు స్కూటీ నడుపుతుంటే రెచ్చిపోయిన ప్రియురాలు
- సీసీటీవీ కెమెరాల సాయంతో జంటను పట్టుకునేందుకు పోలీసుల చర్యలు
లక్నోలోని హజరత్ గంజ్ ప్రాంతంలో ఈ వీడియో తీసినట్టు పోలీసులు గుర్తించారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ అపర్ణ రజత్ కౌశిక్ ఈ వీడియో నిజమైనదేనని నిర్ధారించారు. జంటను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. సీసీటీవీ కెమెరాల సాయంతో వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మోటారు వాహనాల చట్టం, అసభ్యతను వ్యాపింపజేస్తున్నందుకు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.