Sruthi Haasan: శ్రుతిహాసన్ నుంచి తప్పించుకోలేకపోతున్న హ్యాట్రిక్ హిట్!

  • 'క్రాక్' సినిమాతో పెద్ద హిట్ అందుకున్న శ్రుతి హాసన్ 
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పడిన హ్యాట్రిక్ హిట్
  • ఈ ఏడాది ఆరంభంలోనే దక్కిన రెండు భారీ హిట్లు 
  • 'సలార్' తో ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమంటున్న ఫ్యాన్స్  
Sruthi Haasan Special

కమల్ కూతురైనప్పటికీ శ్రుతిహాసన్ కెరియర్ ఆరంభంలో ఐరెన్ లెగ్ ముద్ర నుంచి తప్పించుకోలేకపోయింది. ఆ ముద్రను చెరిపేసుకుని స్టార్ డమ్ ను సంపాదించుకోవడానికి నానా కష్టాలు పడింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ వచ్చిన తరువాత ఆమె బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. అలా టాలీవుడ్ కీ .. కోలీవుడ్ కి అందుబాటులో లేకుండా పోయింది. 

బాలీవుడ్ లో నెగ్గుకురావడం అంత తేలికైన విషయం కాదని గ్రహించిన ఆమె, ఆ తరువాత టాలీవుడ్ వైపుకు రాక తప్పలేదు. గతంలో 'బలుపు' సినిమాతో ఆమెకి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని, 'క్రాక్'లో ఛాన్స్ ఇచ్చాడు. తన లక్కీ హీరోయిన్ అంటూ 'వీరసింహారెడ్డి' సినిమా కోసం ఎంపిక చేసుకున్నాడు. అలా గోపీచంద్ మలినేనితో కలిసి ఆమె హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది.

ఇక 'బలుపు' .. 'క్రాక్' సినిమాల సంగతిని అలా పక్కనే పెడితే, ఈ ఏడాది ఆరంభంలోనే 'వీరసింహారెడ్డి' .. 'వాల్తేరు వీరయ్య'  వంటి హిట్స్ అందుకున్న ఆమె, ఇదే ఏడాది చివరిలో రానున్న 'సలార్'తోను హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకోవడం ఖాయమేననే టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తానికి శ్రుతిహాసన్ ఇలా వెనక్కి వచ్చి అలా భారీ విజయాలను ఎగరేసుకెళ్లడం మిగతా హీరోయిన్స్ కి మింగుడుపడని విషయమే.

More Telugu News