Anand Mahindra: ‘నాటు నాటు’ పాటకు నాటి హాస్యనటుల డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో

Anand Mahindra shares video of Laurel and Hardy dancing to Natu Natu song from RRR
  • ఆర్ఆర్ఆర్ నాటు నాటు డ్యాన్స్ ను పోలినట్టుగా లారెల్ అండ్ హార్డీల నృత్యం
  • తెగ మెచ్చుకుంటున్న నెటిజన్లు
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ లు ఎంతో ఆసక్తిని కలిగించే విధంగా ఉంటాయి. రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాగా, అంతర్జాతీయంగా ఈ సినిమా మరింత గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసిన పాతకాలం నాటి సినిమా క్లిప్ ను ఓ సారి తప్పకుండా చూడాల్సిందే.

ఎందుకంటే ఈ పాటలో ఇద్దరు హాస్య నటులు లారెల్, హార్డీ అచ్చం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మాదిరే రిథమ్ కలుపుతూ డ్యాన్స్ చేశారు. నాటు నాటు పాటను చూస్తే ఎవరూ ఆగలేరు.. అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు. నెటిజన్లు అయితే ఈ వీడియో క్లిప్ ను ఎంతో మెచ్చుకుంటున్నారు. ఆనంద్ మహీంద్రా అకౌంట్ ను ఫాలో అవ్వడానికి ఇలాంటి ట్వీట్లు చాలు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘‘లారెల్, హార్డీ ఆర్ఆర్ఆర్ డ్యుయో మాదిరి ఎనర్జీ చూపించలేకపోవచ్చు. అలా అని వారేమీ చెత్తగా డ్యాన్స్ చేయలేదు’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
Anand Mahindra
latest tweet
sahres
naatu naatu old
rrr

More Telugu News