Mamatha Mohandas: 'విటిలిగో' సమస్యతో బాధపడుతున్న హీరోయిన్ మమత మోహన్ దాస్

Mamatha Mohandas suffering from skin problem
  • విటిలిగో అనేది చర్మ సంబంధిత వ్యాధి
  • దీని బారిన పడిన వారి చర్మంపై మచ్చలు ఏర్పడతాయి
  • శరీరం కూడా రంగు మారుతుంది
అగ్ర సినీ నటి సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆ వ్యాధికి చికిత్స పొందుతోంది. ఇప్పుడు మరో ప్రముఖ నటి అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. దక్షిణాదిన మంచి నటిగా గుర్తింపు పొందిన మమతా మోహన్ దాస్ విటిలిగో అనే చర్మ సమస్య బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ చర్మ రుగ్మత బారిన పడిన వారి చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. రోజులు గడిచే కొద్ది మచ్చల పరిమాణం పెరుగుతుంటుంది. శరీరం రంగు కూడా మారుతుంటుంది. గతంలో మమత క్యాన్సర్ బారిన పడి కోలుకుంది. ఇంతలోనే ఆమె మరో సమస్య బారిన పడటం విచారకరం. 

ఈ సందర్భంగా మమత సోషల్ మీడియాలో భావోద్వేగంతో స్పందించింది. 'ప్రియమైన సూర్య భగవంతుడా... ఇప్పుడు నేను నిన్ను ఎంతో ప్రేమతో హత్తుకుంటున్నా. నా శరీరం రంగు మారుతోంది. అందుకే నీవు రాక ముందే నీ కోసం నిద్ర లేచి.. నీ కిరణాల కోసం ఎదురు చేస్తున్నా. నీ శక్తిని నాకు అందించు. నా జీవితంలో ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను' అని పోస్ట్ చేసింది. సినిమాల విషయానికి వస్తే ఈ అందాల భామ చేతిలో ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు ఉన్నాయి.
Mamatha Mohandas
Tollywood

More Telugu News