Makara Vilakku: శబరిమలలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చిన మకరజ్యోతి

Makara Vilakku appeared in Shabarimala
షార్ట్స్‌లో చూడండి
అయ్యప్పస్వామి భక్తులకు నేడు పరమపవిత్ర మకరజ్యోతి (మకర విళక్కు) దర్శనమిచ్చింది. లక్షలాది భక్తులు మకరజ్యోతిని దర్శించి తరించిపోయారు. ఇక్కడి పొన్నంబలమేడు కొండపై మకర జ్యోతి ప్రత్యక్షం కాగానే స్వామి శరణం... అయ్యప్ప శరణం, స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో శబరిమల కొండ మార్మోగిపోయింది. 

ప్రతి ఏడాది మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల క్షేత్రం వద్ద పొన్నంబలమేడు పర్వతంపై మకరజ్యోతి మూడు సార్లు దర్శనమిస్తుంది. అయ్యప్ప ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే పొన్నంబలమేడు కొండ ఉంటుంది. అయ్యప్ప దీక్షలు చేపట్టిన భక్తులు మకరవిళక్కును దర్శించడాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు.
Go Back to Shorts
Makara Vilakku
Makara Jyothi
Shabarimala
Ayyappa Temple
Kerala

More Telugu News