కోడి పందెం కాయండి.. బుల్లెట్ బండి సొంతం చేసుకోండి.. పందెంరాయుళ్లను ఆకర్షిస్తున్న ఆఫర్లు!
- గుడ్లవల్లేరు మండలంలో నిర్వాహకుల ఎత్తుగడ
- బరుల వద్దే బుల్లెట్ బండ్లు, స్కూటీల ప్రదర్శన
- పోటీ ఎక్కువగా ఉండడంతో తెరపైకి ఆఫర్లు
మండలంలో రెండేళ్లుగా 6 బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహిస్తున్నారు. వీటిలో సగం పెద్దవే కావడంతో నిర్వాహకుల మధ్య పోటీ తీవ్రమైంది. దీంతో పందెం కాసేవారిని ఆకర్షించేందుకు కౌతవరం, వేమవరం బరుల నిర్వాహకులు సరికొత్త ఐడియాతో ముందుకొచ్చేశారు. రూ. 2 లక్షల విలువైన కోడిపందేలను వరుసగా ఐదుసార్లు ఆడితే రూ. 1.75 లక్షల విలువైన బుల్లెట్ బండిని, లక్ష విలువైన పందేలు వరుసగా ఐదుసార్లు ఆడితే స్కూటీని బహుమతులుగా అందించనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, వాటిని బరుల వద్దే ప్రదర్శనకు ఉంచి పందెంగాళ్లను ఆకర్షించే పనిలో పడ్డారు.