Jagan: తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

  • రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి
  • అచ్చ తెలుగు పండుగ అని పేర్కొన్న సీఎం జగన్
  • ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్ష
CM Jagan conveys Sankranti wishes to Telugu people

రేపు భోగిమంటలతో సంక్రాంతి పండుగ శోభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పల్లెల పండుగ, రైతుల పండుగ, మన అక్కచెల్లెమ్మల పండుగ... మొత్తంగా మన సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెప్పే అచ్చ తెలుగు పండుగ అని అభివర్ణించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. 

భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల కోలాహలం, కళకళలాడే పచ్చనిపైర్లు గ్రామాలకు సంక్రాంతి శోభను తీసుకువస్తాయని పేర్కొన్నారు. 

ఈ మకర సంక్రాంతి రాష్ట్ర ప్రజల జీవితాల్లో అభివృద్ధితో కూడిన మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ పండుగ తెచ్చే సంబరాలతో తెలుగు లోగిళ్లలో, ప్రతి ఇంటిలోనూ ఆనందాల సిరులు వెల్లివిరియాలని అభిలషిస్తున్నట్టు సీఎం జగన్ వివరించారు.

More Telugu News