మరోసారి ఉద్యోగులను తొలగించిన ఓలా
- గత ఏడాది 1,100 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా
- తాజాగా మరో 200 మంది ఉద్యోగులపై వేటు
- పునర్వ్యవస్థీకరణలో భాగంగానే తొలగింపులన్న ఓలా
తాజాగా మరో 200 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో టెక్నాలజీ, ప్రాడక్ట్ విభాగాల్లోని ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ తొలగింపులు అని ఓలా తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు కాంపెన్సేషన్ ప్యాకేజీలను అమలు చేస్తామని వెల్లడించింది. మరోవైపు ఇంజినీరింగ్, డిజైన్ విభాగాల్లో నియామకాలు ఉంటాయని తెలిపింది. సీనియర్ ఉద్యోగులను సైతం రిక్రూట్ చేసుకుంటామని చెప్పింది.